పత్రికలు ప్రజలను చైతన్యం చేసే కథనాలు ప్రచురించాలి -- ప్రజా సమస్యల పరిష్కార కోసం పనిచేయాలి

WhatsApp Image 2026-01-24 at 2.50.07 PM

- విజన్ ఆంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ : పత్రికలు ప్రజలను చైతన్యం చేసేలా కథనాలు ప్రచురించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విజన్ ఆంధ్ర దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పత్రికలు ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిక్కచ్చితంగా కథనాలు ప్రచురించి అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. పత్రికలు ఎప్పుడు నిస్వార్ధంగా పనిచేసినప్పుడు సమాజం తప్పుదారి నడిచేటప్పుడు వాటిని సరి చేసే కథనాలు ప్రచురిస్తే చాలావరకు మార్పులు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ఎప్పుడు ఎత్తి చూపిస్తుంటేనే తప్పు చేసే వ్యక్తి కూడా తన ప్రవర్తనను చేసిన పనిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

 WhatsApp Image 2026-01-24 at 2.50.19 PM

విజన్ ఆంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణలో  జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి

జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ అధికారుల సమావేశ హాల్లో విజన్ ఆంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. పత్రికలు నిబద్ధతతో బాధ్యతాయుతంగా వార్తల సేకరణ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజల సమస్యలను ముందుగా పత్రికలు గుర్తించి తెలిసేలా పనిచేయాలని, వాటిని పరిష్కరించడంలో తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు.

WhatsApp Image 2026-01-24 at 2.50.35 PM

విజన్ ఆంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణలో జిల్లా ఎస్పీ డి జానకి 

జిల్లా ఎస్పీ డి జానకి తన చాంబర్లో విజన్ ఆంధ్ర దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ. సమాజంలో శాంతిభద్రతల అంశంలో పత్రికలు ఆచితూచి కథనాలను ప్రచురించాలని అన్నారు. తెలిసిన విషయాన్ని సంబంధిత అధికారులతో సంభాషించి వాటిపై వివాదాస్పదం కాకుండా పత్రికలు వార్త ప్రచురణ చేసి ఇతరులకు ఇబ్బందులు కలగకుండా వార్త కథనాలు ఉండాలని సూచించారు. శాంతి భద్రత అంశంలో ప్రతి ఒక్కరు సహకారం అందించేలా ప్రజలను అప్రమత్తం చేసేలా పత్రికలు సహకరించాలని కోరారు. 

 

WhatsApp Image 2026-01-24 at 2.50.47 PM

విజన్ ఆంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్

మహబూబ్నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ తన నివాసంలో విజన్ ఆంధ్ర దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు .అనంతరం ఆయన పత్రికను ఉద్దేశించి మాట్లాడారు. పత్రికలు ప్రచురించే కథనాలు ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉండాలని అవి పదిమందికి న్యాయం జరిగేలా ఉండాలని అన్నారు. సమాజంలో ధర్మం నాలుగు పాదాలు మీద నిలబడేలా ఉన్న స్తంభాలలో మీడియా కూడా ఒక పాదం అని అన్నారు. శాంతిభద్రతలు, రాజకీయాలు, న్యాయస్థానాలు, మీడియా సంస్థలు నాలుగు పాదాలని తెలిపారు. ఈ నాలుగు పాదాలు సమానంగా కాక్రమంగా జరిగితే స్వర్గంలో ఉంటుందని అందులో ఏ ఒక్కటి దారితప్పిన సమాజం దారి తప్పుతుందన్నారు. అందులో ముఖ్యంగా ప్రజలకు అనుసంధానంగా ఉంటూ ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల సమస్యలను పదిమందికి తెలిసేలా చేసేవి పత్రికలు అన్నారు. వీటన్నింటిని గమనించి పత్రికల్లో పని చేసే విలేకరులు సమతూకంలో వార్తా కథనాలు సేకరించి సమాజానికి మంచిని అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మహబూబ్నగర్ ఫస్ట్ ఇంచార్జ్ గుండా మనోహర్ వివిధ పత్రికల విలేకరులు ఎడిటర్లు రాజకీయ పార్టీల నాయకులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Views: 41

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గ్రామీణ యువత క్రీడా ప్రతిభకు వేదిక – సీఎం కప్ 2026 -ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గ్రామీణ యువత క్రీడా ప్రతిభకు వేదిక – సీఎం కప్ 2026 -ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్ :- గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర స్థాయి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న...
రణదీవెనగర్ లో CPM అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ సిపిఎం జిల్లా నాయకుల ప్రచారం
అభివృద్ధి చూసి ఆదరించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి,
జ్యోతిర్లింగాల దర్శనంకు బయలుదేరిన వాసవి సంఘం సభ్యులు
6వ వార్డు సమగ్ర అభివృద్ధికి వారధినై ఉంటా నేనావత్ రాజ్ కుమార్ (రాజ్ సర్కార్)
బుద్దాగూడలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ స్వాతి జగన్నాథ్
అధికార పార్టీని ఆదరించండి వేగంగా అభివృద్ధి చేస్తా. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి