కుట్ర దారులను తరిమికొట్టండి -- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డి

WhatsApp Image 2026-02-09 at 11.41.24 AM

 

మహబూబ్ నగర్   :  కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్న వారిని ఓటుతో తిప్పి కొట్టాలని 11వ వార్డు అభ్యర్థి మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రజలను కోరారు. ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి కార్నర్ మీటింగ్లో మాట్లాడారు.బండమీదిపల్లి లో పుట్టి విద్యాభ్యాసం పూర్తి చేసి ఇక్కడే పెళ్లి చేసుకుని ఇక్కడే ఉద్యోగం రావడం ,జీవితంలో స్థిరపడినందుకు కొద్దికాలం బండమీదిపల్లి దూరం కావడం దేవుడు మళ్లీ బండమీద పల్లి నుంచి రాజకీయ జీవితం కల్పించేందుకు అవకాశం ఇచ్చారని, సొంత ఊరు మర్చిపోవద్దని, నీ ఊరికి నీవు ఏదో చేసుకోవాలని, రుణం తీర్చుకోవాలని తిప్పితిప్పి దేవుడు ఇక్కడికే రప్పించారని అన్నారు. కొంతమంది చెబుతున్నారు తాను ఇక్కడ ఉండడు అక్కడ ఉంటాడు అంటున్నారు కానీ నేను బరాబర్ ఇక్కడే ఉంటా బండమీదిపల్లిలోనే నా తండ్రి అమ్మిన ఇల్లును కొంత పునర్నిర్మానం చేసి అందరికీ అందుబాటులో ఉండేలా ఆఫీసును ఏర్పాటు చేసి అందరి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటా అందరి కష్టాల్లో పాలుపంచుకుంటా, కష్టసుఖాల్లో తోడుగా అండగా ఉంటా, ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే సహకారంతో తీసుకెళ్లి అన్నింటిని పరిష్కారం చేస్తానని అన్నారు. 60 డివిజన్లలో నెంబర్ వన్ డివిజన్ గా 11 వ డివిజన్ ను అభివృద్ధి చేసి గత పాలకులకు కనువిప్పు కలిగేలా పనులు చేసి చూపిస్తా ప్రజలందరి మనన్నలు పొందుతారని అన్నారు. కల్లబొల్లి నాలుగు మాటలు చెప్పి, నాలుగు జోళ్ళు చెప్పి మాట తప్పే రకం తనది కాదన్నారు. మన బాధలు కష్టాలు జీవితాలు మారాలని చెప్పారు. కూలిపోయిన వాళ్లకు ఇల్లు కావాలి రాజీవ్ గృహకల్ప నివాసదారులకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఆ బిల్డింగ్ కూలిపోయే దుస్థితికి వచ్చిందని ఆ బిల్డింగును తిరిగి నిర్మాణం చేయించేలా ఎమ్మెల్యే సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండదండలతో పూర్తి చేస్తానన్నారు. రాజు గృహకల్ప గృహాలన్నీ శిథిలావస్థకు చేరిపోయాయని వాటిని చూస్తే దయనీయ స్థితికి చేరుకున్నాయన్నారు. పాత బిల్డింగుల స్థలంలో కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసి  తీరుతామని హామీ ఇచ్చారు. బుడగజంగా కాలనీ కూడా చాలా మంది ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు బుడుగ జంగం కాలనీవాసులు మాట తప్పనోళ్లు మడమ తిప్పనోళ్ళు, మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తులు దుడుగజంగా లు అన్నారు. ముదిరాజ్ బిడ్డలు,యాదవులు కమిటీ హాల్ కావాలని కోరుతున్నారు వాటిని కూడా నిర్మాణం చేసి అందిస్తానన్నారు. చాలామంది  నిరుద్యోగులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, గతంలో తాను కూడా ఈ ప్రాంతంలోని చదువుకున్నాను ఇక్కడినే చదువు ప్రాక్టీస్ చేశాను పోలీసు ఉద్యోగానికి కూడా ఇక్కడే ప్రిపేర్ అయ్యాను, ఇక్కడి యువత కష్టం నాకు తెలుసు చాలామంది యువకులకు హోంగార్డు ఉద్యోగాలు కూడా కల్పించిన సంగతి ఇక్కడి వాసులకు తెలుసు ఇక్కడ పనిచేస్తున్న వారు కూడా ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో అమర్ రాజా కంపెనీలో కొత్త హాస్పిటల్ లో ఎక్కడ ఉన్నా సరే ఉపాధిలో బండమీదిపల్లి వాసుల భాగం ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని కోరారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో చూసిన కొత్త హాస్పిటల్ లో చూసిన ఎక్కడ చూసినా బండమీదిపల్లి వాసుల కు అవకాశం ఉండాలని కోరారు. వడ్డగేరి చాల కష్టాల్లో పడిఉంది. టెంపుల్ నిర్మాణం కోసం మాట ఇచ్చాం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి ఇస్తాం. కమిటీ హాల్ పైన అదనంగా భవనం నిర్మాణం చేపట్టి మహిళలకు స్కేల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. వడ్డగిరిలో ఇండ్లు చాలా దుస్థితిలో ఉంటాయి కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లోనే జీవనం గడుపుతున్నారని అన్నారు వారందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వపరంగా ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి సమస్యలు పరిష్కరించేందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ మీరంతా ఓటు వేసి గెలిపిస్తే అది సాధ్యమవుతుందన్నారు. ఈ సమయంలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మంది మాటలు విని పప్పులో కాలేస్తే మన జీవితాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని సూచించారు. ఈ సువర్ణ అవకాశాన్ని కోల్పోతాం మీరు ఆలోచించి ఓటు వేయాలని చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి వస్తే మేమేస్తం మేం చూసుకుంటాం అంటూ  సొంత బిడ్డల నన్ను చూసుకొని మీరే సొంత అభ్యర్థులుగా మారి ప్రచారం చేస్తున్న తీరుకు జీవితాంతం రుణపడి ఉంటా అన్నారు. మీ రుణం తీసుకునే అవకాశం ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఆ దేవుడు అవకాశం కల్పించాలని అన్నారు .

మీ కష్టాల్లో పాలు పంచుకుంటా మీ ఉద్యోగాల ఉపాధిలో భాగమవుతా మీ కూడు గూడు డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు కరెంటు లైన్లు అన్నింటినీ ఛాలెంజ్గా తీసుకొని ఈ ఏరియాను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. దరిద్రంపై కష్టాలపై యుద్ధం చేస్తా, బండమీదిపల్లి ఇంత అందంగా ఉంటదా ఈ ప్రాంతం పాలమూరులో ఇంత అభివృద్ధి చెందిందా అని అందరూ ఆలోచించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానన్నారు. అభివృద్ధిలో 11వ వార్డు కార్పొరేషన్ లోని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతా అన్నారు. పదవ తేదీ ఇంటింటికి ఒక సైనికుడిగా పని చేసే విధంగా ఒక సురేందర్ రెడ్డి బయలుదేరి కాంగ్రెస్ పార్టీని గెలిపించేలా పనిచేయాలని కోరారు. బండమీదిపల్లి వాసులను ఓటర్లను మభ్యపెట్టే వారికి మరో విధమైన సహకారం అందిద్దామన్నారు. నేను ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నాకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి కూడా సహాయం చేస్తే గుణం ఉందన్నారు. ఎవరో ఏదో చెప్పినా మనుషుల మాటలు పట్టించుకోలేదని కోరారు. పాలమూరు మొత్తం బండమీదిపల్లి వైపు చూస్తుంది సురేందర్ రెడ్డి వస్తే మాత్రం మాస్ లీడర్ అవుతాడని ఇక్కడి ప్రజలతో కలిసి పోతాడు ప్రజలతో కలిసి సమస్యలు పరిష్కరిస్తాడు, మళ్లీ మాకు నాయకత్వం దొరకదని కొంతమంది కుట్రలు పన్నుతున్నారన్నారు. ఆ కుట్రలన్నింటిని తిప్పి కొట్టాలని ఓటర్లను కాలనీవాసులను డివిజన్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 41

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...  అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...
    అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను... కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న
ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం
శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...
పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .
రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే