ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి -జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

WhatsApp Image 2026-02-23 at 3.50.49 PM

 

మహబూబాబాద్  : ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో  అన్ని విభాగాల అధికారులతో కలిసి  కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే వినతులను ప్రాధాన్యత క్రమంలో స్వీకరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాల ని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని బాధితుల నుండి 131 దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.ముఖ్యంగా భూమి రికార్డుల సవరణ, వారసత్వ మ్యుటేషన్లకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలి. సామాజిక పింఛన్లు, రేషన్ కార్డులు మరియు ఇతర ప్రభుత్వ పథకాల కోసం వచ్చిన అర్జీలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని అన్నారు.మురుగునీటి కాలువలు, త్రాగునీరు మరియు విద్యుత్ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన పూజరి సుశీల తనకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన స్లాబ్ పూర్తి చేసి వేరిఫికేషన్ పూర్తయి సాంక్షన్ కాని డబ్బులను వెంటనే ఇప్పించగలరని కోరారు. ఇనుగుర్తి మండలం మీట్యాతండ కు చెందిన రైతులు తాము గత 30 సంవత్సరాల నుండి వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని అట్టి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ భూములకు పట్టాలను మంజూరు చేసి ఇవ్వాలని కోరారు.పట్టణంలోని బేతోల్ గ్రామానికి చెందిన గ్రామస్తులు గ్రామంలోప్రభుత్వ పాటశాల కు చెందిన భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించి  వేరొకరికి అమ్మారని అట్టి స్థలాన్ని విచారణ చేసి సమస్యని పరిష్కరించాలని అన్నారు. నేటి ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి  మొత్తం 131 దరఖాస్తులను పరిష్కారానికి అధికారులకు ఆదేశించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో జెడ్.పి సీ ఈఓ పురుషోత్తం, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు,  డి.హెచ్.ఎస్.ఓ మరియన్న, డి.ఎం.ఇండస్ట్రీ శ్రీమన్నారాయణ,మైనారిటీ డెవలప్మెంట్ అధికారులు, శ్రీనివాసరావు, డి.పి.ఓ హరిప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రవి రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి సరిత,జిల్లా సంక్షేమ అధికారి సబిత,డి.ఎం. సివిల్ సప్లై అధికారి కృష్ణవేణి, జిల్లా ఉపాధి అధికారి రజిత, ఎల్.డి.యం యాదగిరి, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్,  సూపరింటెండెంట్ మదన్ మోహన్, భూభారతి కోఆర్డినేటర్ సురేష్, మండలాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...  అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...
    అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను... కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న
ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం
శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...
పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .
రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే