రాజకీయాలకు తావులేకుండా అభివృద్ధి ... త్వరలో డెవలప్‌మెంట్ కమిటీ' ఏర్పాటు

WhatsApp Image 2026-02-16 at 5.53.58 PM

 

మధిర  :  మధిర పట్టణాన్ని రాష్ట్రంలోనే ఒక 'రోల్ మోడల్'గా, నివసించడానికి అత్యంత అనువైన 'మోస్ట్ లివబుల్ టౌన్'గా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం మధిరలో మున్సిపల్ నూతన పాలు ఒక వర్గం ఎన్నిక తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని చేకూర్చిన ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయబోమని, అత్యంత బాధ్యతగా ఈ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని  స్పష్టం చేశారు. ప్రజలు తమపై ఉంచిన అపారమైన నమ్మకాన్ని గౌరవిస్తూ, అత్యంత బాధ్యతగా ఈ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. "అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత.. ఈ మూడు సూత్రాలతో మధిర పట్టణ వాసులకు మెరుగైన పాలన అందిస్తాం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ - తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేసి మధిర ప్రజల రుణం తీర్చుకుంటాం" అని ఆయన పేర్కొన్నారు.
రాజకీయాలు పక్కన పెట్టండి..
మధిర పట్టణాన్ని భవిష్యత్తు తరాలకు ఒక 'రోల్ మోడల్'గా తీర్చిదిద్దడమే తమ తక్షణ కర్తవ్యమని వెల్లడించారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గానికి దిశానిర్దేశం చేశారు.
నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లకు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. "పదవులు చేపట్టాక ఇక రాజకీయం ఉండకూడదు. 'నో పాలిటిక్స్ - ఓన్లీ డెవలప్‌మెంట్' అనే నినాదంతో పని చేయాలి. పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడానికి ఉమ్మడి ప్రణాళికతో ముందుకు సాగాలి" అని సూచించారు.అభివృద్ధి కమిటీ ఏర్పాటు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచేలా మధిరను అభివృద్ధి చేసేందుకు పట్టణంలోని పెద్దలు, మేధావులతో రాజకీయాలకు అతీతంగా ఒక 'డెవలప్‌మెంట్ కమిటీ'ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కమిటీ పట్టణ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి నూతన పాలకవర్గానికి తగిన సలహాలు సూచనలు ఇస్తుందన్నారు. వీరి సలహాలు, సూచనలతో పట్టణ రూపురేఖలు మార్చి, రాష్ట్రంలోనే మధిరను ఒక మోడల్ టౌన్‌గా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి 15 రోజులకు లేదా నెలకు ఒకసారి అభివృద్ధి పనులపై తానే స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఇందుకోసం ఒక ప్రత్యేక క్యాలెండర్‌ను ఫిక్స్ చేసుకుని, ప్రణాళికాబద్ధంగా పట్టణ రూపురేఖలు మారుస్తామని చెప్పారు. ప్రతిభావంతంగా పనిచేసి మధిరను ప్రగతి పథంలో అగ్రస్థానంలో నిలపాలని పాలకవర్గానికి ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ మీడియా సమావేశంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొండ బాల కోటేశ్వర్ రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామనాథం, మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోన దని కుమార్  మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటరమణ, నూతనంగా గెల్చిన కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Views: 46

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డాక్టర్ గానే కాదు… ప్రజా సేవలోనూ ముందుంటా....    19వ డివిజన్ కార్పొరేటర్‌గా డాక్టర్ స్వప్న శంకర్ నాయక్ ప్రమాణ స్వీకారం డాక్టర్ గానే కాదు… ప్రజా సేవలోనూ ముందుంటా.... 19వ డివిజన్ కార్పొరేటర్‌గా డాక్టర్ స్వప్న శంకర్ నాయక్ ప్రమాణ స్వీకారం
    కొత్తగూడెం   : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్‌కు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ డాక్టర్ స్వప్న శంకర్ నాయక్ ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజకీయాలకు తావులేకుండా అభివృద్ధి ... త్వరలో డెవలప్‌మెంట్ కమిటీ' ఏర్పాటు
విద్యతో సేవా దృక్పథం…
దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలి. జిల్లా కలెక్టర్ అనుదీప్
కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవనున్న మంత్రి తుమ్మల
నల్లగొండ మేయర్,డిప్యూటీ మేయర్ ల ఎన్నిక ఏకగ్రీవం. నగర అభివృద్ధికి మంచి సంకేతం.
కామారెడ్డి మున్సిపాల్ చైర్పర్సన్ గా స్వతంత్ర అభ్యర్థి - వైస్ చైర్మన్ గా భిఆర్ఎస్ అభ్యర్థి