ఎన్నికల్లో మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు. కరీంనగర్ మాజీ మేయర్ 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్.

కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చిన ఘనత 58వ డివిజన్ కార్పొరేటర్, కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ మరోసారి మాట నిలబెట్టుకున్న నాయకుడిగా నిలిచారు. శుక్రవారం కరీంనగర్ నగరంలోని 58వ డివిజన్‌కు చెందిన మాడిశెట్టి రవీందర్–నిర్మల దంపతుల కుమార్తె అక్షిత వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు స్వయంగా హాజరైన సర్ధార్ రవీందర్ సింగ్, ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.25,000 నగదును ఆడబిడ్డకు కట్నం కింద అందజేశారు. కుటుంబ సభ్యులను అభినందిస్తూ, నూతన వధూవరులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల విశ్వాసమే తనకు అతిపెద్ద బలం అని పేర్కొన్నారు. నగర ప్రజలు తన మీద నమ్మకంతో వరుసగా ఆరు సార్లు కార్పొరేటర్ గా గెలిపించారని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట తనకు బాధ్యతగా భావిస్తానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ధ్యేయమని తెలిపారు. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలిచి, అవసరమైన చోట సహాయం అందించడం ప్రజాప్రతినిధిగా తన కర్తవ్యమని స్పష్టం చేశారు.స్థానికులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరచిపోకుండా అమలు చేయడం అభినందనీయమని అన్నారు. వివాహ వేడుకలో పాల్గొన్న ప్రజలు, నాయకులు ఆయన సేవా తత్పరతను ప్రశంసించారు.ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, సామాజిక బాధ్యతల నిర్వర్తనలో ముందుండే నాయకుడిగా సర్ధార్ రవీందర్ సింగ్ పేరు మరొకసారి ప్రతిష్టాత్మకంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


