అంగరంగ వైభవంగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి కళ్యాణం...

శంకరపట్నం : హర హర శంభో శంకర మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని ఆశేష భక్తజనం నడుమ వేద పండితుల మంత్రోత్సవాల నడుమ ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం చింతల పల్లె గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో గల శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు పల్లె తిరుపతిరెడ్డి, గ్రామ సర్పంచ్ చింతల లావణ్య శ్రీనివాస్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిర్లు ఏర్పాటు చేశారు. శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి కళ్యాణానికి హాజరైన భక్తులకు అన్న పసాద వితరణ, దాతల దాతల సహకారంతో, ఆలయ కమిటీ, గ్రామ సర్పంచ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతల లావణ్య శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షులు పల్లె తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బొంతల గణపతి, ఉపాధ్యక్షులు శనిగరం శ్రీనివాస్, కోశాధికారి బొమ్మ దేని సతీష్, ప్రచార కార్యదర్శి చింతల నవీన్, ముఖ్య సలహాదారు మంద శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కోమల్ రెడ్డి, సదయ్య ,శ్రీకాంత్ ,అశోక్ ,తిరుపతి రెడ్డి, తిరుమల్ రెడ్డి, సర్పంచ్ పల్లె సంజీవరెడ్డి, పల్లె పాపిరెడ్డి, అల్లపు రాజేశ్వరి రాజయ్య, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


