కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : నీట్ పేపర్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు డిమాండ్ చేశారు. ఏఐసిసి, టిపిసిసి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపు మేరకు బుదవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో పట్టణ కేంద్రంలోని శివాజీ విగ్రహం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాంబాబు మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున కర్గె, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో చిత్ర హింసలు పెట్టడాన్ని ఖండించారు. ఢిల్లీలో లాఠీ ఛార్జీలో గాయపడిన విద్యార్థులకు ఉచిత వైద్యం అందించాలని అన్నారు. నీట్ పేపర్ లీక్ వల్ల మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, చిల్పూరుగుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 72
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
