అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
చౌటకూర్ : అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు – ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. సింగూరు ప్రాజెక్టు నుంచి ఉమ్మడి పుల్కల్ మండలంలోని 45 గ్రామాలకు సరఫరా అవుతున్న తాగునీరు అక్టోబర్ చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటి సరఫరా) ఏ ఈ నాగసాయి తెలిపారు. అనంతరం సింగూరు నుంచి నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం ఉన్నందున గ్రామపంచాయతీలు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామంలో ఇప్పటికే ఉన్న బోరు బావులను వెంటనే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని సర్పంచులు, గ్రామపంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.పాత బోర్ల మరమ్మతులు, కొత్త బోర్ల ఏర్పాటుకు ఆదేశాలు మరమ్మతులకు అవకాశం లేని బోర్ల స్థానంలో అవసరమైతే కొత్త బోర్లు తవ్వించి తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత గ్రామపంచాయతీలపై ఉందని నాగసాయి స్పష్టం చేశారు. నీటి కొరత ఏర్పడకముందే ప్రత్యామ్నాయ వనరులను సిద్ధం చేసుకోవడం ద్వారా ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించవచ్చని పేర్కొన్నారు. అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి బోరు బావుల మరమ్మతులు, కొత్త బోర్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
