ఉద్యమకారుల గుర్తింపులో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి
- జర్నలిస్టు సంఘం నేత తుమ్మ కృష్ణ
- ప్రొఫెసర్ కోదండరాం కు వినతిపత్రం అందజేత
సిద్ధిపేట /మర్కుక్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించి,వారి సేవలకు,త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని జర్నలిస్టు సంఘం నేత తుమ్మ కృష్ణ కోరారు.హైదరాబాద్ లో సచివాలయం ఎదురుగా ఉన్న తెలంగాణ అమర జ్యోతిలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు,గౌరవం,సంక్షేమంపై,జర్నలిస్టులతో ఉద్యమ గుర్తింపు కమిటీ నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో భాగంగా మంగళవారం రోజు జర్నలిస్టులతో నిర్వహించిన సమావేశంలో తుమ్మ కృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా తుమ్మ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో జర్నలిస్టులు ఉద్యమకారులతో కలిసి ర్యాలీలు,ధర్నాలు,నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని,పలుచోట్ల ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీలకు నాయకత్వం వహించారని తుమ్మ కృష్ణ గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ప్రపంచానికి చాటిచెప్పే బాధ్యతను నిర్వర్తించారనీ,అలాగే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు పలువురు జర్నలిస్టులు తమ ఉద్యోగాన్ని కోల్పోయారని,అయినప్పటికీ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి తెలంగాణ సమాజం కోసం తమ జీవితాలను అంకితం చేశారని తుమ్మ కృష్ణ తెలిపారు.ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక కమిటీ ఈ అంశాన్ని సానుభూతితో పరిశీలించి,ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని సేవలందించిన జర్నలిస్టుల కు ఉద్యమకారులుగా గుర్తింపు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులందరికీ స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించి వారికిచ్చే గౌరవం ఇవ్వాలని,300 గజాల ఇంటి స్థలంతో పాటు ఇంటిని నిర్మించి ఇవ్వాలని,ప్రైవేటు ఆసుపత్రులలో కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని,55 సంవత్సరాల పైబడిన జర్నలిస్టులందరికీ పింఛన్ అందజేయాలని వారు కోరారు.అనంతరం ఈ వివరాలతో కూడిన వినతిపత్రాన్ని కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాంకు వారు అందజేశారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
