చీమలపాడు సబ్ సెంటర్లో గర్భిణీ స్త్రీల వైద్య శిబిరం నిర్వహణ
కారేపల్లి (ఖమ్మం) మండల పరిధిలోనీ చీమలపాడులో గల సబ్ సెంటర్లో గర్భిణీ స్త్రీల వైద్య శిబిరాన్ని మంగళవారం వైద్య సిబ్బంది విజయవంతంగా నిర్వహించారు.శిబిరంలోగర్భిణీలకురక్తపోటు,బరువు,హీమోగ్లోబిన్ తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీచేశారు.అలాగేసమతుల్య ఆహారం,ఐరన్-ఫోలిక్ యాసిడ్ మాత్రల వినియోగం, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ప్రమాద సూచనలు,క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఆరోగ్య సిబ్బంది పాల్గొని గర్భిణీలకు అవసరమైన సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నరసింహారావు,ఎంఎల్ హెచ్పిలు కళ్యాణి,సంధ్య,మహాలక్ష్మి, ఏఎన్ఎంలు నాగమణి,సునీత ,ఉషారాణి, సబ్ సెంటర్లకు చెందిన ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Views: 38
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
