విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం
నల్లబ్యాడ్జీలతో నిరసన
మందమర్రి, (మంచిర్యాల):దేశ భవిష్యత్తుఅయిన విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని, పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాధ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్ విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ, ప్రతిపక్ష ఎంపీల అరెస్టులను నిరసిస్తూ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ విగ్రహం ముందు నల్లబ్యాడ్జీలతో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్,భీమా మల్లేష్, కూతురు ప్రభాకర్,పట్టణ మాజీ అధ్యక్షుడు పల్లె రాజు,మాజీ జడ్పిటిసి యాకుబ్ అలీ,పనాస రాజయ్య,ఎర్రం విద్యాసాగర్ రెడ్డి,అధికార ప్రతినిధి మొట్టే సుధాకర్, సత్యనారాయణ,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
