మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్ఫిట్ చేయాలి

మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్ఫిట్ చేయాలి

టేకులపల్లి (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా):కోయగూడెం ఓపెన్‌కాస్ట్ (కెఓసీ)లో మెడికల్ బోర్డుకు హాజరైన కార్మికులందరినీ మెడికల్ అన్ఫిట్‌గా ప్రకటించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం కెఓసీ పీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కాలరీ మేనేజర్ పేరాల శ్రీనివాస్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.పిట్ కార్యదర్శి మాలోత్ హరిసింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇల్లందు ఏరియా బ్రాంచ్ సహాయ కార్యదర్శి కొంగర వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల నిర్వహించిన మెడికల్ బోర్డుకు 124 మంది కార్మికులు హాజరుకాగా కేవలం 24 మందినే మెడికల్ అన్ఫిట్‌గా ప్రకటించడం తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత తక్కువ మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం కార్మికులకు అన్యాయమని, యాజమాన్యం తన నిర్ణయాన్ని వెంటనే పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు.సింగరేణి కార్మికులు బొగ్గుగనుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తూ అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. గనుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన కార్మికులు ఆరోగ్య సమస్యల కారణంగా విధులు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, వారికి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులు తమ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వారసులకు కారుణ్య నియామకాల అవకాశాలు కల్పించేందుకు మెడికల్ అన్ఫిట్ కోరుతున్నారని, అలాంటి కార్మికులను పునఃసమీక్షించి అర్హులైన వారందరినీ మెడికల్ అన్ఫిట్‌గా ప్రకటించాలని ఏఐటీయూసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో మనోజ్ కుమార్, దల్ సింగ్, సామెల్, కర్ణశంకర్, కిషోర్, సాంబశివరావు, వినీత్, మోహన్, షబ్బీర్, శ్రీనివాస్, వెంకట నరసయ్య, సతీష్, నాగేశ్వరరావు, శివ, కనకరాజు, మైకేల్, పైడి రాజు, హరిలాల్, జి.ఎ. శ్రీనివాస్, రంజిత్, నవీన్ కుమార్, ఎంవీ డ్రైవర్ కోటయ్య, కనకయ్య, మాసూద్, భాస్కర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Views: 34

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
ఎమ్మెల్యే పై సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబర్దార్..!
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 
అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.
చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం