ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీల పునర్నిర్మాణం
ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని గిరిజన భవనంలో తుడుందెబ్బ (ఆదివాసీ హక్కుల పోరాట సమితి) మరియు ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీల పునర్నిర్మాణ సమావేశం జరిగింది. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు కోట్నాక్ విజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో పాత కమిటీలనే యథావిధిగా కొనసాగించాలని జాతీయ, రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. తుడుందెబ్బ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు, ప్రధాన కార్యదర్శి పూర్క చిత్రు, జిల్లా కార్యదర్శులు పెద్ది సంతోష్, మెస్రం మనిక్ రావు, ఆత్రం హన్మంత్ రావు, సిడం బాపూరావు. ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీ, జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కనక గణేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మారప గంగారాం, ప్రధాన కార్యదర్శి పెందోర్ దీపక్. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పెందోర్ హన్మంత్, నార్నూర్ మండల ఉపాధ్యక్షుడు మెస్రం మోతిరాం, ఉట్నూర్ నాయకుడు పెందోర్ మోతిరాం తదితరులు పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
