రాహుల్ గాంధీ అరెస్ట్ సిగ్గు చేటు
- కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
- మండిపడ్డ కాంగ్రెస్ నేత కొలుకూరి నర్సింహారెడ్డి
పటాన్చెరు (సంగారెడ్డి): పటాన్చెరు పట్టణంలో సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదాపైన పెద్ద ఎత్తున నిరసన ధర్ననిర్వహించారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నర్సింహ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని, ఎంపీ ప్రియాంకా గాంధీని, డిల్లీలో విద్యార్ధులకు మద్దతుగా వారికి న్యాయం జరగాలని గాంధేయ మార్గంలో నిరసన చేస్తే అక్రమంగా అరెస్టు చేసి దౌర్జన్యానికి పాల్పడింది అని అన్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని రక్తం వచ్చే విధంగా బీజేపీ మోదీ ప్రభుత్వము రాహుల్ గాంధీ పై దాడులకు పోలీసుల ద్వారా చేయించారని అన్నారు. దేశంలో బీజేపీ మోదీ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఇప్పటివరకు జరిగిన 153 పరీక్షల్లో పరీక్షా పత్రాలు లిక్ కారణంగా ఈ ఒక్క సంవత్సరం 2026 లో ఒక్క నీట్ పరీక్ష పత్రం లిక్ తో కలత చెంది 22 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు 7కోట్ల విద్యార్థుల జీవితాలతో బీజేపీ మోదీప్రభుత్వం ఆటలాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. నిరసన ధర్నా కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పిసిసి కార్యదర్శి మతిన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిలు ముదిరాజ్, రవి ముదిరాజ్, యువజన కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్ సింగ్, అక్షిత్, శ్రీనివాస్, ఐ ఎన్ టి సి నాయకులు రతన్ సింగ్, వినోద్, పవన్ సింగ్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు జ్యోతి, కల్పన, ప్రభావతి రాణి, సంధ్య తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


