ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి
మర్కుక్ : సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని పాములుపర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం నాడు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా డిప్యూటీ సీఈవో మర్కుక్ మండల ప్రత్యేక అధికారి సంధ్య,మండల వ్యవసాయ అధికారి బోయినపల్లి రాము పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలన్నారు. అధిక నీటి అవసరం ఉన్న వరి పంటకు బదులుగా పంట మార్పిడి విధానాన్ని అనుసరించి కూరగాయలు, నూనెగింజల (ఆయిల్ సీడ్) పంటలను సాగు చేయాలని సూచించారు.అలాగే ప్రతి రైతు తన పొలంలో పంట కుంటలను నిర్మించుకొని వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని,తద్వారా అవసరమైన సమయంలో పంటలకు జీవనాధార నీటిని అందించవచ్చని వివరించారు.వ్యవసాయ శాఖ అధికారులు సూచించే శాస్త్రీయ సాగు పద్ధతులను పాటిస్తూ,వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించి పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని రైతులకు సూచించారు.ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక,నీటి యాజమాన్యం,పంట మార్పిడి వంటి చర్యలు తీసుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దుబ్బాసి భవాని బాల కిషన్,ఉప సర్పంచ్ జుట్టు సుధాకర్,వార్డు సభ్యులు,రైతులు,తదితరులు పాల్గొన్నారు.
Views: 26
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
