పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌ను 21వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకం గా కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా తమ డివిజన్‌లో విజయవంతంగా నిర్వహించిన మెగా హెల్ప్ డెస్క్ కార్యక్రమాన్ని పట్టణ స్థాయిలో కూడా బాయ్స్ కాలేజ్ గ్రౌండ్/స్టేడియంలో ఒక ఆదివారం నిర్వహించాలని కోరారు. దీంతో పట్టణ ప్రజలకు వివిధ ప్రభుత్వ సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి వస్తాయని వివరించారు.అలాగే, 21వ డివిజన్‌లో ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రానికి శాశ్వత భవనాన్ని మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. శిథిలావస్థకు చేరుకున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాలను మరమ్మతులు చేపట్టి, అర్హులైన పేద లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని కూడా కోరారు.వినతిపత్రంలో పేర్కొన్న అంశాలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారుల తో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Views: 50
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
