విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే సహించేది లేదు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే సహించేది లేదు.

  • పేపర్ లీకేజీల బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి.
  • తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.

తాండూరు, (వికారాబాద్ జిల్లా):విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే సహించేది లేదని, పేపర్ లీకేజీల బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా యాలాల్ మండలంలోని లక్ష్మినారాయణపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా నిరసన కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి  మాట్లాడుతూ.. ఈరోజు మనం ఇక్కడికి వచ్చింది రాజకీయాల కోసం కాదు.. మన విద్యార్థుల భవిష్యత్తు కోసం అని,విద్యార్థులకు మద్దతుగా నిల్చిన రాహుల్ గాంధీపై పోలీసులతో దాడి చేయించడం పూర్తిగా ఖండిస్తూ, తాండూర్ కాంగ్రెస్ పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేందుకు, డాక్టర్ కావాలనే తమ కలను సాకారం చేసుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్నారు. అయితే పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అవకతవకల కారణంగా వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరిగితే మనం చూస్తూ ఊరుకోబోం. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే సహించేది లేదని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి, ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 39

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
ఎమ్మెల్యే పై సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబర్దార్..!
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 
అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.
చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం