పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తగలడంతో వర్షాకాలంలో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పాఠశాల సిబ్బంది, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి చెట్ల కొమ్మలను తొలగించి ప్రమాదాన్ని నివారించారు.ఈ చర్యతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల పరిసరాల్లో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే తొలగించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు కోరారు.
Views: 27
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
