ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 1,100 నోటు పుస్తకాల పంపిణీ.

ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.

తాండూరు (వికారాబాద్ జిల్లా) ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ తాండూర్ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బుధవారం నోటు పుస్తకాలు, విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.మంబాపూర్, ఖానాపూర్, దుగ్గాపూర్, రుక్మాపూర్, మదనంతాపూర్, మాన్సాన్‌పల్లి ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 260 మంది విద్యార్థులకు 1,100 నోటు పుస్తకాలు, 25 స్లేట్లు, 260 పెన్సిళ్లు, 260 రబ్బర్లు, 260 స్కేళ్లు పంపిణీ చేయడంతో పాటు చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఫ్రూటీ అందజేశారు.ఈ సందర్భంగా జాతీయ కన్వీనర్ మన్మోహన్ సార్డా మాట్లాడుతూ, గత 35 సంవత్సరాలుగా ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ తాండూర్ శాఖ విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాఖ అధ్యక్షుడు కిషన్ రాఠీ, కార్యదర్శి కరణ్ జైన్, సభ్యులు అనిల్ సార్డా, శ్రీకాంత్ సార్డా ,నిఖిల్ గాగ్రాణి, కిషన్ బూబ్, అంకిత్ సార్డా, దీపక్ బూబ్, దీపక్ సోని, గిరిధర్ పార్టాని, మాధవ్ పార్టాని, నితిన్ సార్డా పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త కె వి ఎం వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 
Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
ఎమ్మెల్యే పై సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబర్దార్..!
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 
అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.
చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం