హరితహారం–పారిశుద్ధ్యానికి పెద్దపీట
- తిమ్మాపూర్, కుడుగుంట గ్రామాల్లో ఎంపీడీవో శాంతమ్మ, ఏపీవో అంజిరెడ్డి విస్తృత పర్యటన
- ఇందిరమ్మ ఇళ్లకు సోక్‌పిట్ మార్కింగ్.. 3,500 మొక్కల నాటడానికి శ్రీకారం.. గ్రామస్తులకు పారిశుద్ధ్యంపై అవగాహన
మర్పల్లి, (వికారాబాద్ జిల్లా): మర్పల్లి మండలంలోని తిమ్మాపూర్, కుడుగుంట గ్రామపంచాయతీల్లో గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎంపీడీవో శాంతమ్మ , ఏపీఓ అంజిరెడ్డి బుధవారం పరిశీలించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తిమ్మా పూర్ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు వ్యక్తిగత సోక్‌పిట్‌ల ఏర్పాటుకు మార్కింగ్ ఇవ్వించారు. అలాగే గ్రామ చివరలో స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) నిధులతో రూ.92 వేల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ సోక్‌పిట్‌కు కూడా మార్కింగ్ చేశారు. అనంతరం కుడుగుంట గ్రామపంచాయతీలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో శాంతమ్మ, గ్రామానికి మంజూరైన 3,500 మొక్కలలో తొలి విడతగా 350 మొక్కలను నాటించారు. మే నెలలో తవ్విన గుంతల్లో ప్రస్తుతం మొక్కల నాటకం కొనసాగుతోందని తెలిపారు. గ్రామంలోని మహిళలకు తడి చెత్త–పొడి చెత్త వేరు చేయడానికి రెండు రకాల చెత్త బుట్టలను ఎంపీడీవో శాంతమ్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు.గ్రామస్తులను ఉద్దేశించి ఎంపీడీవో శాంతమ్మ మాట్లాడుతూ వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటిని మరిగించి చల్లార్చి తాగాలని, ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెత్తను బయట పడేయకుండా అందించిన బుట్టల్లోనే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామపంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందజేయాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యమే విజయానికి కీలకమని ఎంపీడీవో శాంతమ్మ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భారతమ్మ–శంకరయ్య, ఉపసర్పంచ్ శేఖర్, వార్డు సభ్యురాలు నర్సమ్మతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది, 15 మంది కూలీలు చురుకుగా పాల్గొన్నారు.
Views: 33
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
