చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం

చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం

చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల పురోగతిపై బుధవారం చౌటకూర్ మండలం కేంద్రంలో రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ వసంత కుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. సమావేశంలో గ్రామస్థాయిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి హామీ పనులు, పారిశుద్ధ్యం, పల్లె అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ లక్ష్యాల సాధన తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ప్రతి శాఖ అధికారి తమ పరిధిలోని కార్యక్రమాల పురోగతి వివరాలను నివేదించారు. అధికారులకు స్పెషల్ ఆఫీసర్ మార్గదర్శకాలు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ వసంత కుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలను నిర్దేశించిన గడువుల్లో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, పురోగతి నివేదికలను ఎప్పటికప్పుడు అందించాలని తెలిపారు. సమావేశంలో ఎంపీఓ సువర్ణ, డిప్యూటీ తహసీల్దార్ అనుదీప్, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది మరియు వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయా శాఖలకు సంబంధించిన కార్యాచరణపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. 
 
Sanareddt.jpg 1.jpg 02
Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
ఎమ్మెల్యే పై సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబర్దార్..!
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 
అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.
చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం