పెచ్చులూడి ప్రమాదకరంగా ఆదర్శ పాఠశాల భవనం

 పెచ్చులూడి ప్రమాదకరంగా ఆదర్శ పాఠశాల భవనం

కారేపల్లి (ఖమ్మం):ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ భవనం ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకుంది.రోజూ వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న ఈ భవనంలో ఎక్కడికక్కడ గోడల పెచ్చులు ఊడిపోవడంతో విద్యార్థులు,ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.పాఠశాల ప్రిన్సిపాల్ గదిలో సైతం గోడల నుంచి పెచ్చులు ఊడిపడుతున్న పరిస్థితి.వర్షాలు కురిసే సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సుమారు 13 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ మోడల్ స్కూల్ భవనం నిర్మాణ నాణ్యతపై తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. బయటకు చూస్తే భవనం ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ,లోపల గోడల్లో పగుళ్లు, ఊడిపోతున్న స్లాబ్ పెచ్చులు బలహీనమైన నిర్మాణం స్పష్టంగా కనిపిస్తోంది.ప్రతి రోజు వందలాది మంది విద్యార్థులు ఈ భవనంలోనే తరగతులకు హాజరవుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోననే భయం నెలకొంది.ఏదైనా భయానక సంఘటన జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్న స్థానికుల్లో వ్యక్తమవుతోంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భవనానికి తక్షణమే సాంకేతిక పరీక్షలు నిర్వహించి,అవసరమైన మరమత్తులు చేయుటకు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు,పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా పాఠశాల భవనం చుట్టూ ప్రహరీ లేకపోవడంతో పందులు, కుక్కలు సైతం పాఠశాలలోకి ప్రవేశిస్తున్నాయి. వాటి మూలాన సీజనల్ వ్యాధులు ప్రబలి పిల్లలకు అంటు రోగాలు వ్యాపిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.పాఠశాల చుట్టూరా ప్రహరీ లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందనీ బాలికలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యం ఉన్నా ప్రహరీ లేకపోవడం ఇబ్బందికరంగా ఉందని తమ పిల్లలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. వీటిపై ప్రిన్సిపాల్ ఏలియట్ ప్రేమ్ కుమార్ ను వివరణ కోరగా పాఠశాల భవనముకు పెచ్చులు ఊడి పడుతున్నది వాస్తవమేనని ఈ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని,ప్రహరీ లేకపోవడం కూడా ఇబ్బందికరంగానే ఉందని,ఇతరులు సైతం పాఠశాలలోకి వచ్చే వీలు ఉందని అన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. 
Views: 41

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
ఎమ్మెల్యే పై సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబర్దార్..!
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 
అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.
చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం