కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
బిచ్కుంద, : రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ, నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాందేడ్–161 జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నాయకత్వం వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుల అరెస్టులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యార్థుల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
