ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
కొత్తగూడెం, : ఇల్లందు క్రాస్ నుంచి బొమ్మనపల్లి క్రాస్ మధ్య లోతువాగు గ్రామం వద్ద జాతీయ రహదారి (ఎన్‌హెచ్-930పీ)పై ఉన్న ఓవర్‌బ్రిడ్జికి చేపట్టిన మరమ్మతు పనులు పూర్తయ్యాయని, ఈ నేపథ్యంలో అమలులో ఉన్న ట్రాఫిక్ డైవర్షన్‌ను జూలై 22 ఉదయం 8 గంటల నుంచి ఎత్తివేస్తున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. రేపటి ఉదయం నుంచి వాహనాలు యథావిధిగా ఓవర్‌బ్రిడ్జిపై రాకపోకలు సాగించవచ్చని ఆయన పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, సూచిక బోర్డులు మరియు ట్రాఫిక్ పోలీసుల సూచనలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో మరమ్మతు పనులు సజావుగా పూర్తయ్యాయని, భవిష్యత్తులో కూడా ట్రాఫిక్ నిర్వహణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు. ట్రాఫిక్‌కు అంత రాయం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో మరమ్మతు పనులను విజయవంతంగా పూర్తి చేయడంపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, పోలీసు అధికారులను అభినందించారు.
Views: 131
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
