ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 

ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 

తాండూరు, (వికారాబాద్ జిల్లా): తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ, ఎస్. ఎన్. రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ వికార్ాబాద్ జిల్లా కమిటీ మరియు తాండూరు డివిజన్‌లోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, యాజమాన్యాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపి, మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని 2026–2028 కాలానికి తాండూరు నూతన కార్యవర్గాన్ని అధికారికంగా ధృవీకరించింది.తాండూరు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం  అధ్యక్షులుగా అక్షర పాఠశాల ప్రిన్సిపల్ ఎం వి ఎన్ మోహన్ కృష్ణ గౌడ్ ఎన్నికైనట్లు వెల్లడించారు.ఈ నిర్ణయానికి  రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు  నాగయ్య,  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బస్వరాజ్ గౌడ్, రాష్ట్ర సలహాదారు ముజీబ్ ఉర్ రహ్మాన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  నరేష్ రాజు, అలాగే (టిఆర్ఎస్ యంఎ) వికార్ాబాద్ జిల్లా అధ్యక్షులు  వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు  వీరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ అభిలాష్ రెడ్డి, జిల్లా కోశాధికారి శ్రీ ప్రకాష్ తమ ఆమోదాన్ని తెలియజేస్తూ సంతకాలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరులో సంఘ ఐక్యతను కాపాడడం, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడం మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ కార్యవర్గాన్ని ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర కమిటీ పేర్కొంది.(టిఆర్ఎస్ యంఎ) తాండూరు కార్యవర్గం (2026–2028)గాను గౌరవ అధ్యక్షురాలు: కీర్తి శర్మ, అధ్యక్షుడు:  ఎం.వి.ఎన్. మోహన్ కృష్ణ గౌడ్, ఉపాధ్యక్షుడు:  వహీద్, ప్రధాన కార్యదర్శి:  వెంకటేష్, సయుక్త కార్యదర్శి: సునీత,కోశాధికారి: ఎం. రమేష్ గౌడ్, సలహా కమిటీ సభ్యులుగా ఇందూర్ రాములు, సోహెల్ ఉమ్రి ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, తాండూరు డివిజన్‌లోని అన్ని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నూతన కార్యవర్గానికి సంపూర్ణ సహకారం అందించి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
Views: 216

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
ఎమ్మెల్యే పై సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబర్దార్..!
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 
అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.
చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం