బండి సంజయ్ ఇంటి వద్ద బీజేపీ -కాంగ్రెస్ ఘర్షణ
కరీంనగర్ : కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ నివాసం వద్ద బుధవారం బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. నీట్ పేపర్ లీకేజీ, రాహుల్ గాంధీ అరెస్ట్‌ను ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు బండి సంజయ్ ఇంటి ముందు ధర్నాకు యత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారుకాంగ్రెస్ నేతలు నినాదాలు చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. అనంతరం కర్రలు, లాఠీలతో కాంగ్రెస్ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
పోలీసుల లాఠీచార్జ్
పరిస్థితి అదుపు తప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు దాదాపు 20 మంది కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నియంత్రించారు. బండి సంజయ్ నివాసం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Views: 33
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
