పాము కాటుకు గురైన మహిళకు 108 సిబ్బంది సకాలంలో ప్రాణరక్షణ
టేకులపల్లి( భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ) టేకులపల్లి మండలం కోక్యతండ గ్రామానికి చెందిన డి. సరోజ (35), భర్త రాంసింగ్ పత్తి చేలో వ్యవసాయ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా పాము కాటుకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది అత్యంత వేగంగా సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలికి ప్రథమ చికిత్స అందిస్తూ అంబులెన్స్‌లోనే అవసరమైన వైద్య సేవలు ప్రారంభించారు. అనంతరం ఆమెను సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు తరలించారు.అక్కడ వైద్యులు చికిత్స అందించి పరిస్థితి నిలకడగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.ఈ ఘటనలో సకాలంలో స్పందించి ప్రాణాపాయ పరిస్థితి నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించిన 108 ఈఎంటి రమ్యకృష్ణ మరియు పైలట్ వెంకటరామారావు సేవలను సరోజ భర్త రాంసింగ్ ప్రత్యేకంగా అభినందించారు. అత్యవసర సమయంలో వేగంగా స్పందించి సమయానికి వైద్యం అందించిన 108 సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Views: 211
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
