మందమర్రిలో మాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్
మందమర్రి : పచ్చని భవిష్యత్తు కోసం మందమర్రి ఏరియాలో ఘనంగా ‘మాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్’ మంగళవారం చేపట్టారు. ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏరియా నర్సరీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఒకే రోజు 500 మొక్కలు నాటారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఏక్ పెడ్ మా కే నామ్’ బృహత్ వృక్షారోపణ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటుజిఎం లలిత్ ప్రసాద్,ఎస్.కె ఏజెంట్ సంతోష్ కుమార్,కేకే ఏజెంట్ ఖాదిర్,ఐఈడి డిజిఎం కిరణ్ కుమార్,ఫారెస్ట్ అధికారి నవీన్, ఎన్విరాన్మెంట్ అధికారి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
