కరీంనగర్ జిల్లా చొప్పదండిలో “ప్రజా పాలన- ప్రగతి బాట” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు….

కరీంనగర్ : తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామని కరీంనగర్ గడ్డపై నుంచి సోనియా గాంధీ మాట ఇచ్చారు ఎన్ని అవాంతరాలు ఎదురైనా సర్వం కోల్పోయినా.. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు చేశారు. పదేళ్లు అంది వచ్చిన అధికారాన్ని అవకాశాన్ని ఉపయోగించుకుని బీఆరెస్ నాయకులు వేల కోట్లు సంపాదించుకున్నారు తప్ప ప్రజలకు చేసిందేం లేదు. పదేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు వాళ్లు విషం చిమ్ముతున్నారు. పదేళ్లలో కనీసం పేదలకు డబుల్ బెడ్రూంలు కూడా ఇవ్వలేదు ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకుంటున్నాం రైతులకు ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 10 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాం సన్నబియ్యం, ఆర్టీసీలో మహిళలకు ఉచితసౌకర్యం అందించాం నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దమనిషి పాలమూరుకు వచ్చిండు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ మీ జాతీయ నాయకులందరినీ తీసుకూరండి మా కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీజేపీని గెలవనీయరు గతంలో పాలమూరుకు వచ్చిన ప్రధాని మోదీ పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామన్నారు రాష్ట్రానికి వచ్చిన జాతీయ అధ్యక్షుడు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు మెట్రో రైలు రెండో విడత గురించి మాట్లాడలేదు, కాళేశ్వరం విచారణపై మాట్లాడలేదు మూసీ ప్రక్షాళన నిధుల ఊసు ఎత్తలేదు.. ఏం మొహం పెట్టుకుని బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రానికి ప్రచారానికి వస్తున్నారు? బీజేపీ, బీఆరెస్ ది ఫెవికాల్ బంధం పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ అవయవ దానం చేసి బీజేపీని 8 స్థానాల్లో గెలిపించింది అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రానికి పంపించాం ఆరు నెలలైనా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంగా మారిందన్న ప్రధాని ఎందుకు సీబీఐ విచారణ చేపట్టలేదు ఫార్ములా ఈ రేసు కేసులో IAS పై విచారణకు అనుమతి కోరుతూ లేఖ రాస్తే ఇప్పటికే స్పందన లేదు కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆరెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి బీజేపీ, బీఆరెస్ ది చీకటి ఒప్పందం రెండేళ్లలో ఏం చేశారని బీజేపీ, బీఆరెస్ మమ్మల్ని ప్రశ్నిస్తోంది పదేళ్లలో బీఆరెస్ ఏం చేసింది, పన్నెండేళ్లల్లో మోదీ ఏం చేశారో చర్చిద్దాం రండి… రెండేళ్లలో మేం ఏం చేశామో చెబితే మీ గుండెలు పగులుతాయ్ నిరుద్యోగులకు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం 70 వేల మంది తలలు లెక్కపెడదాం ధైర్యముంటే ఎల్బీ స్టేడియంకు రండి వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం హాస్టల్ విద్యార్థులకు కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచాం చొప్పదండిలో డిగ్రీ కాలేజీ నిర్మిస్తున్నాం రైతులకు 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేశాం
9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించాం కేవలం రైతుల కోసమే రెండేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేశాం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించాం వరి వేస్తే ఉరి అని మీరంటే.. రైతులు పండించిన ప్రతీ గింజ మా ప్రభుత్వం కొంటుంది వ్యవసాయం పండుగ చేసి చూపిస్తున్నాం.. ఆడబిడ్డలు కట్టుకునే చీరల్లో కూడా గత ప్రభుత్వంలో కమిషన్లు తీసుకున్నారు మా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం రెండేళ్లల్లో రూ. 9 వేల కోట్లు ఖర్చు చేశాం రెండేళ్లలో రూ. 27 కోట్లు మహిళలకు రుణాలు అందించి వ్యాపారంలో ప్రోత్సహిస్తున్నాం ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం రాష్ట్రాన్ని దోచుకుని అప్పులపాలు చేసి పోయి కెసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నాడు ఆయన సడ్డకుని కొడుకు .. ఇసుకనే కాదు మిడ్ మానేరు ఇండ్లను కూడా వదలలలేదు మందు అప్పటోలేనే.. మూలుగుడు మునుపటోలేనే అన్నట్లు కేసీఆర్ వ్యవహార శైలి ఉంది. 2027 లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ఆలయాలను అభివృద్ధి చేస్తాం ఎకో టూరిజంను అభివృద్ధి చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చి దిద్దుతాం మేడారం సమ్మక్క- సారలమ్మ దర్శనానికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రాలేదు పేదోళ్ల దేవుళ్లను మొక్కేందుకు వాళ్లకు నామోషీ.. బీఆరెస్ ఎన్ని శాపనార్ధాలు పెట్టినా మరో ఎనిమిదేళ్లు అధికారం మాదే.. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం కరీంనగర్ కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తాం వరంగల్, కరీంనగర్ జంట నగరాలుగా అభివృద్ధి చేసి రెండింటి మధ్యలో డంప్ యార్డు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తాం బండి, గుండు తెచ్చేదేం లేదు.. మోదీ ముందు మాట్లాడే ధైర్యం వాళ్లకు లేదు బండి సంజయ్ మాపై రంకెలేయడం కాదు.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేసి కెసీఆర్ ను బొక్కలో వేయించాలి ఢిల్లీ నుంచి కరీంనగర్ మున్సిపల్ అభివృద్ధికి ఏం నిధులు తెచ్చారో బండి సంజయ్ చెప్పాలి ఎవ్వరు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా తెలంగాణ అభివృద్ధి ఆగదు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి వాళ్లను ఎన్నుకోండి.. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి మళ్లీ వస్తా.. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తాం
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


