క్యాంపు రాజకీయాలకు ____చరమ గీతం పాడాలి
(తెలంగాణలో పురపాలక సంస్థలకుఛైర్మెన్ డిప్యూటీ చైర్మెన్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో హంగు రాజకీయాల్లో చోటు చేసుకున్న క్యాంపు రాజకీయాలకు స్పందిస్తూ రాసిన కవిత)

కరీంనగర్ : ఓటు వేసిన వేలు ప్రశ్నించే గొంతుకై
ప్రగతికి దిక్సూచి కావాలి
గెలిచిన కౌన్సిలర్ కార్పొరేటర్
తన వార్డు డివిజన్లోనే ఉండాలి
ప్రజా తీర్పును రిసార్ట్ గదుల్లో
బంధించే కుట్ర కుళ్ళు సంస్కృతికి
ఇకనైనా పాడాలి చరమగీతం
నియోజకవర్గం నీడన పెరగాల్సిన
నాయకత్వం సరిహద్దులు దాటి
పరాయి పంచన దాక్కుంటారా?
ప్రజలిచ్చిన అధికారం పదవుల
వేట కోసం దోచుకోవడం దాచుకోవడం కోసం
దిగజారుడు రాజకీయాలు
మానుకోవాలి
ఎన్నికైన నాయకులు తమ
బాధ్యతలు మరిచి పదవి
వ్యామోహానికి బేరసారానికి
మద్యం విందులకు
తాకట్టు పెడుతారా?
గెలిపించినవాడు గుండెలు
బాదుకుంటుంటే గెలిచినవాడు
స్విమ్మింగ్ పూలు పక్కనవిందులు
వినోదాలు విహారయాత్రలపేరున
చిందులు వేస్తాడా ?
సేవ చేయాల్సిన చేతులు
విందుల వలలో భంధీఅయితే
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది
తీరని అవమానం
పార్టీ ఫిరాయింపుల పర్వానికి
ముగింపు పలకాలి ప్రలోభాలకు
లొంగే బానిసత్వానికి చరమ గీతం
పాడాలి రిసార్ట్ రాజకీయాల
పునాదులు కూల్చి జనం మధ్య
తిరిగే నిజాయితీగల నాయకులకు
పట్టం కట్టాలి
రేపటి తరానికి విలువలతో
కూడిన రాజకీయం కావాలి
గెలిచిన వారు క్యాంపుల గోడల
మధ్య కాదు ఉండేది
ప్రజల గుండెల్లో నిలవాలి
నిక్కచ్చిగా నిలిచేవాడు
ఇచ్చిన మాట తప్పని మడమ
తిప్పని సేవాభావం కలిగిన
రాజకీయాలు కావాలి
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న
అంశాల అమలుకు కార్యాచరణ
మొదలు పెట్టాలి
స్వార్థ రాజకీయాలకుముగింపు
పలకాలి ఎన్నికైన నాయకులు
ఎస్కార్ట్ లేకుండా స్వేచ్ఛగా ప్రజల
మధ్య ఉండాలి కొత్త రాజకీయ
సంస్కృతి నిర్మాణానికి
ఉద్యమించాలి
వికసిత భారత్ లక్ష్యసాధనకై
ప్రగతి శీల బాగస్వామ్య ఆత్మ
నిర్భర సుస్థిర ప్రజాస్వామిక
నవ రాజకీయాలకు నాంది
పలకాలి
క్యాంపు రాజకీయాలకు వద్దు
అభివృద్ధి ఆదర్శ రాజకీయాలే
ప్రజాప్రతినిధుల హద్దు కావాలి
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
కరీంనగర్
9440245771
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


