నిజాంపేట్‌లో చెత్త సంక్షోభం: అధికారుల నిర్లక్ష్యంపై ఆకుల సతీష్ ఆగ్రహం

నిజాంపేట్ : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డంపింగ్ యార్డ్ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతుండటంపై సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆయన విమర్శించారు. ఒకవైపు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ సృజన చెత్త నిర్వహణలో కఠిన చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం పరిస్థితి నియంత్రణలో లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలో ప్రతి రోజు సుమారు 150 టన్నుల చెత్త సేకరించబడుతుండగా, డంపింగ్ సాటిలైట్ సెంటర్ నుంచి జవహర్ నగర్‌కు తరలించేందుకు ప్రతి సంవత్సరం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడం ఆనవాయితీగా జరుగుతుందని తెలిపారు. గత కాంట్రాక్టర్ ‘శివశక్తి ట్రేడర్స్’ కాంట్రాక్ట్ ముగిసి దాదాపు 15 రోజులు కావొచ్చినా, కొత్త కాంట్రాక్టర్ ఎంపికలో జాప్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుమారు 2000 టన్నుల చెత్త డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిందని, చెత్త తరలింపులో స్పష్టత లేకపోవడంతో ఆటోలు రోడ్లపైనే చెత్త వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా దుర్వాసన, దోమల విస్తరణ వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ విచారణలో ఉన్న పాత కాంట్రాక్టర్‌కు చెల్లింపులు చేయవద్దని సూచనలు ఉన్నప్పటికీ, చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలపై డిప్యూటీ కమిషనర్ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా చెత్త సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. గత రెండు రోజులుగా 10 నుంచి 15 టిప్పర్లతో నామమాత్రంగా చెత్త తరలింపు చేపట్టినా, రోజువారీగా వచ్చే చెత్త పరిమాణానికి అది సరిపోదని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాన డిమాండ్లు
రోజుకు కనీసం 200 టన్నుల చెత్త తరలించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
డంపింగ్ యార్డ్‌లో హిటాచిల సహాయంతో చెత్తను ఒకవైపు క్రమబద్ధీకరించి, ఆటోలు లోపలికి వెళ్లేలా ఏర్పాటు చేయాలి అని తెలిపారు.సమస్య తీవ్రతకు కారణమైన అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి అన్నారు. జగద్గిరిగుట్ట మాదిరిగా కంప్రెస్సింగ్ కంటైనర్ సిలిండర్ల ద్వారా చెత్త రవాణా వ్యవస్థను తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ సమస్యలపై సమగ్ర అవగాహన కోసం ఆకుల సతీష్ గురువారం జగద్గిరిగుట్టలోని జీహెచ్ఎంసీ డంపింగ్ సాటిలైట్ ట్రాన్స్పోర్టేషన్ సెంటర్‌ను సందర్శించి, అక్కడి నిర్వహణ విధానాలను పరిశీలించారు. ఈ వారంలోనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ చెత్త సంక్షోభాన్ని అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అరుణ్‌రావు, ఈశ్వర్ రెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


