పాపయ్య కుంటను మురికినీటి బారినుంచి రక్షించాలి

WhatsApp Image 2026-02-14 at 11.26.25 AM

 

నిజాంపేట్  : నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని సర్వే నంబర్ 105లో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాపయ్య కుంటను మురికినీటి బారినుంచి రక్షించాలని కాలనీ ప్రజలు డిమాండ్ చేశారు. తురుక చెరువు నుండి మురికినీటిని మళ్లించడం వల్ల గత నాలుగేళ్లుగా మంచినీటి చెరువు తీవ్రంగా కలుషితమైందని ఆరోపిస్తూ స్థానికులు తురుక చెరువు వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆకుల సతీష్, అల్లాడి మహేష్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ, 2021 వరకు ప్రజల వినియోగానికి అనువుగా ఉన్న పాపయ్య కుంట, అనంతరం చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ పనుల మార్పుల కారణంగా మురికినీటి నిల్వగా మారిందన్నారు. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తురుక చెరువు నుండి బండారు లేఔట్, రెడ్డి అవెన్యూ మార్గంగా అంబీర్ చెరువులోకి వెళ్లే వర్షపు నీరు, మురికినీటి ప్రవాహ మార్గాలను మార్చడంతో గ్రీన్ ఫీల్డ్, మధుర నగర్ ప్రాంతాల మీదుగా డ్రైనేజ్ నీరు పాపయ్య కుంటలోకి చేరుతోందని వివరించారు.
సర్వే నంబర్ 109 ప్రాంతంలో ప్రతిరోజూ ఓపెన్ డ్రైనేజ్ రూపంలో మురికినీరు ప్రవహించడం వల్ల దోమల పెరుగుదల అధికమైందని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులో గత నాలుగేళ్లుగా గుర్రపు డెక్క పేరుకుపోవడంతో పరిస్థితి మరింత విషమించిందని పేర్కొన్నారు. చెరువు పరిసర ప్రాంతాలు కూడా డ్రైనేజ్ నీటితో నిండిపోవడం ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో కాలనీ ప్రజలు మాట్లాడుతూ తురుక చెరువు నుండి వచ్చే మురికినీటిని రాజధాని స్కూల్ వద్ద నుంచి బండారు లేఔట్ ఎస్‌ఎన్‌డీపీ నాలాకు మళ్లించాలి అన్నారు. మధుర నగర్ ప్రాంతం నుంచి వచ్చే డ్రైనేజ్ నీటిని పాపయ్య కుంటలోకి రాకుండా ఎస్‌ఎన్‌డీపీ లైన్‌లోకి డైవర్షన్ చేయాలని తెలిపారు. చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తక్షణమే తొలగించాలన్నారు. పాపయ్య కుంటను 2021కు ముందు ఉన్నట్లుగా మంచినీటి చెరువుగా పునరుద్ధరించాలి చెప్పారు.
పాపయ్య కుంట నుండి సిరి బాలాజీ వరకు రూ.4 కోట్ల వ్యయంతో 367 చదరపు మీటర్ల ఎస్‌ఎన్‌డీపీ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం కన్నా, రాజధాని స్కూల్ నుంచి బండారు లేఔట్ వరకు 324 చదరపు మీటర్ల నాలా నిర్మాణం చేపట్టడం సముచితమని సూచించారు. చెరువు కట్టపై శుభ్రత చర్యలు చేపట్టి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. పాపయ్య కుంట పరిరక్షణకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం, భూగర్భ జలాల సంరక్షణ దృష్ట్యా సమస్యను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని కాలనీ ప్రజలు స్పష్టం చేశారు.
ధర్నాలో అల్లాడి మహేష్ గుప్తా, కోటగిరి రాంబాబు గుప్తా, కృష్ణమోహన్, రంజిత్, మాధవరావు, అరుణ్ రావు, శ్రీనివాస్, సతీష్, పాండు, సుబ్బరాజు గుప్తా, సునీల్ గుప్తా, కళ్యాణ్ గుప్తా, అల్లం రాము, నాగరాజు, అమలేశ్వరి, శ్రీహరి గుప్తా, సునీల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

 

WhatsApp Image 2026-02-14 at 11.26.25 AM

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జగిత్యాల సీఎం కప్‌లో నూకపల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రభంజనం! జగిత్యాల సీఎం కప్‌లో నూకపల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రభంజనం!
    మల్యాల  : శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద స్టేడియంలో జగిత్యాల జిల్లా స్థాయి సీఎం కప్  ఆటల పోటీలలో అండర్-18 షాట్
ఝరి బి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్
జన విజ్ఞాన వేదిక వార్షికోత్సవంలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
శివరాత్రి సందర్బంగా మర్పల్లిలో పండ్ల కొట్టుల సందడి
జాతర ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ నగేష్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని అంచనా
అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
కాకతీయుల కళావైభవం... నాగులపహాడ్ శివాలయం