ఆహార భద్రత చట్టం 2013 పకడ్బందీగా అమలు చేయాలి - ఫుడ్ కమిషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు ఆనంద్, గోవర్ధన్ రెడ్డి, శారద, భారతి, జ్యోతి లు శుక్రవారం కామారెడ్డి జిల్లాలోని రామిరెడ్డి మండలం సందర్శించారు.ఆహార భద్రత చట్టం 2013 అమలు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్-2013 కింద అమలవుతున్న పథకాల పై క్షేత్ర పర్యటనలు నిర్వహించి, కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత పౌర సరఫరాల , డి డబ్ల్యు ఒ సంక్షేమ కార్యక్రమాల పై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలని,ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని అందుకు అధికారులు తమ వంతు సహాయ సహకారాలు అందించి జిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆహార భద్రత చట్టం 2013 అమలు తీరుపై కమిషన్ సభ్యులు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అవి వారికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. లబ్ధిదారులకు గల చట్టబద్ధమైన హక్కులను అమలు చేయాలని తెలిపారు.అంగన్వాడి కేంద్రంలో నాణ్యత ప్రమాణాలు పాటించి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ కేంద్రాల్లో బరువు తక్కువ ఉన్న పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు కోడిగుడ్లు, పోషకాహారం కచ్చితంగా అందించాలని, స్టాక్ రిజిస్టర్లు సరిచూసుకోవాలని జిల్లా సంక్షేమాధికారికి సూచించారు. ఈ సందర్భంగా రేషన్ షాప్ దుకాణాల పనితీరు, ఆహారధాన్యాల కేటాయింపు, లిఫ్టింగ్ పంపిణీ విధానం, పారదర్శకత చర్యలను సమీక్షించారు. స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రిజిస్టర్లు, కేటాయింపు ఉత్తర్వులు , ఇ-పోస్ లావాదేవీల నిర్వహణను పరిశీలించి లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు సకాలంలో అందుతున్నాయా, దారి మళ్లింపు లేదా అక్రమాలు జరుగుతున్నాయా అనే అంశాలపై , ఐసిడిఎస్ పిఎం పోషణ్ పథకాల కింద పోషకాహార సహాయం అమలు, సరఫరా నాణ్యత, క్రమబద్ధతను . అలాగే ప్రసూతి ప్రయోజన పథకం అమలుపై వివరాలు, ఎన్ ఎఫ్ ఎస్ ఏ కింద అర్హత కలిగిన కుటుంబాల గుర్తింపు, కవరేజ్ స్థితి, జిల్లా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరు, నిర్దేశిత గడువులో ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై సమీక్షించారు. సామాజిక తనిఖీలు, విజిలెన్స్ కమిటీల పనితీరు, నిల్వ కేంద్రాలు గోదాముల పరిస్థితి, నాణ్యత సంరక్షణ చర్యలపై నివేదికలు లబ్ధిదారులకు నాణ్యమైన ఆహార ధాన్యాలు పారదర్శకంగా, సకాలంలో అందేలా తదితర అంశాల పై చర్చించి అధికారులు చర్యలు తగు తీసుకోవాలని సూచించారు.ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు.ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

