మర్కుక్ రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమం
- మండల రైతులకు విత్తనాల పంపిణీ
- మర్కుక్ మండల వ్యవసాయ అధికారి రాము
సిద్ధిపేట, మర్కుక్ : మర్కుక్ మండల రైతు వేదికలో మంగళవారం నాడు విత్తన మేళాను మండల ప్రత్యేక అధికారి సంధ్య పరిశీలించి రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు అధిక నీటి అవసరమున్నవరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలని సూచించారు.వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకొని వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విక్రమ్,మండల వ్యవసాయ అధికారి బోయినపల్లి రాము,మర్కుక్ సర్పంచ్ రాణి మల్లేష్,గంగాపూర్ యూసఫ్‌ఖాన్‌పల్లి సర్పంచ్ శ్యామల ప్రవీణ్,వ్యవసాయ విస్తరణ అధికారులు విష్ణు,భాను శ్రీ రైతులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


