జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

జనగామ: జనగామ మున్సిపల్ ఎన్నిక మంగళవారానికి వాయిద పడింది. 30 మంది సభ్యులు ఉన్న ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 13, బిఆర్ఎస్ కు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నలుగురు ఇండిపెండెంట్ లుగా గెలిచారు. ఆ నలుగురు ఇండిపెండెంట్ లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. 5వ వార్డ్ కౌన్సిలర్ మిద్దెపాక భాస్కర్, 15వ వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండులు కాంగ్రెస్ గూటికి చేరగా, 8వ వార్డ్ కౌన్సిలర్ సందుపట్ల మంజుల, 23వ వార్డు కౌన్సిలర్ భూష పర్వతాలు బిఆర్ఎస్ తో ఉండిపోయారు. భారీ బందోబస్తు నడుమ
సోమవారం క్యాంపు నుండి నేరుగా జనగామ మున్సిపాలిటీకి చేరుకున్న కౌన్సిలర్లు మొదట ప్రమాణ స్వీకారం చేపట్టిన అనంతరం వీడియో ప్రజెంటేషన్ సమక్షంలో అక్కడికి హాజరైన సభ్యులందరికీ సంతకాలు సేకరించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జనగామ ఆర్డీవో గోపీరామ్. అలాగే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి చైర్మన్ అభ్యర్థిగా కడకంచి బాలమణి పేరును 15వ వార్డు కౌన్సిలర్ పాండు సూచించగా, బిఆర్ఎస్ పార్టీ నుండి చైర్మన్ గా గోపగాని సుగుణాకర్ ను తొమ్మిదో వార్డు కౌన్సిలర్ గుడిగంటి వెన్నెల ప్రతి పాయించారు. ఇరుపార్టీల నుండి కౌన్సిలర్లు వారి వారి చైర్మన్ అభ్యర్థులను బలపరచాల్సి ఉండగా చామల కిరణ్ కుమార్ ఎన్నికల అధికారితో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని,దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయిందని, రేపటి వరకు చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. దీంతో 15 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికల అధికారి పోడియం ఎదుట బైఠాయించి చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని పట్టుబట్టారు. పూర్తి కోరమ్ ఉన్నందున ఎన్నికలు వాయిదా వేసే అవకాశం లేదని గోపి రామ్ పదేపదే చెబుతూ వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే సభ్యులకు స్వేచ్ఛ కావాలని, అందువల్ల రేపటి వరకు వాయిదా వేయాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో ఆందోళన వాతావరణం నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి ఈ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన15 మంది కౌన్సిలర్ లు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి కాంగ్రెస్ పార్టీ పోలీస్ బలగాలను ఉపయోగించి ఎన్నికలను వాయిదా వేయించిందని, డిసిపి రాజమహేంద్ర నాయక్, ఏసిపి పండరీ చేతన్ లు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని, తప్పుడు కేసులు నమోదు చేసి వాస్తవాలను వక్రీకరిస్తున్నారని పల్లా ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆ పార్టీ కౌన్సిలర్లతో సహా ఆందోళన చేపట్టారు. దీనిపై చామల మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని,ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సబబు కాదని తాము కోరడంతో రిటర్నింగ్ అధికారి వాయిదా వేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే 15వ వార్డు సభ్యుడు మారబోయిన పాండు,5వ వార్డు సభ్యుడు మిద్దపాక భాస్కర్ల ను ఎమ్మెల్యే పల్లా బెదిరింపులకు దిగుతున్నారదని, వారికి ప్రాణహాని ఉందని మీడియా ఎదుట వారు వాపోయారు. కౌన్సిలర్లు ఆ తర్వాత తిరిగి క్యాంపుకు వెళ్లిపోయారు. ఆధ్యాంతం ఆసక్తిగా మారిన ఈ ఎన్నిక ఎట్టకేలకు వాయిదా పడింది. మంగళవారం అయిన సజావుగా ఈ ఎన్నిక జరుగుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తి ఆసక్తిగా మారింది.

About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


