నిబంధనలు పాటించకుండా కంకర రవాణా ఆగేనా..!! ప్రమాదాలు - వాహనదారులకు ఇక్కట్లు తప్పేనా..??

మెట్ పల్లి : నిబంధనలు పాటించకుండా కంకర రవాణా ఆగేనా..!! ప్రమాదాలు - వాహనదారులకు ఇక్కట్లు తప్పేనా..?? అన్నట్లుగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి డివిజన్ పరిధిలో పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే... డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్ పల్లి మండలాల్లో, గ్రామాల్లో గృహ నిర్మాణాలు, ఇతర నిర్మాణాలకు వినియోగించే క్రషర్ మిషన్ పదార్థాలు 10 ఎంఎం-కంకర, 20 ఎంఎం-కంకర, 40 ఎంఎం-కంకర, క్రషర్ చిప్స్, క్రషర్ డస్ట్ వంటి పదార్థాలు ట్రాక్టర్లు, టిప్పర్లలో రవాణా చేసే క్రమంలో రహదారుల్లో ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు పాటించకుండా అనగా క్రషర్ పదార్థాలు లోడ్ తో రవాణా చేసే వాహనాలకు టార్పాలిన్, జూట్, కాన్వాస్, ప్లాస్టిక్ షీట్ వంటివి కప్పి రవాణా చేయాల్సిన నిబంధనలు వున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా క్రషర్ రవాణా దారులు యథేచ్ఛగా రవాణా చేయడం వల్ల రహదారులపై క్రషర్ పదార్థాలు కంకర వంటివి కింద పడడంతో వాహనదారులకు ప్రమాదాలు సంభవించడం, ద్విచక్ర వాహనాల యొక్క టైర్లు తరచుగా పంచర్లు అవుతున్నాయని ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు. అదేవిధంగా జాతీయ రహదారిపై క్రషర్ పదార్థాలు లోడుతో వెళ్ళే టిప్పర్లు, ట్రాక్టర్లు ట్రాఫిక్ నియమాలను పాటించాల్సి వుండగా అనగా వాహన వేగం, లైట్లు, సిగ్నల్స్ వంటివి పాటిస్తూ రవాణా చేయాల్సిందిగా నియమ, నిబంధనలు ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా క్రషర్ రవాణా దారులు యథేచ్ఛగా రవాణా కొనసాగిస్తున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు, వాహనదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి, మెట్ పల్లి డివిజన్ పరిధిలోని క్రషర్ రవాణా దారులు నియమ, నిబంధనలు పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


