జిల్లాలో 418 కోట్ల రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ

జిల్లాలో 418 కోట్ల రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ

  • ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం. అందుకే ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి
  • అభివృద్ధి, సంక్షేమమే మా మంత్రం సంగారెడ్డిని నంబర్ వన్ గాచేద్దాం
  • రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి: 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంగారెడ్డి లో ఘనంగా జరిగాయి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్యఅతిథిగా హాజరై సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అమరవీరుల త్యాగఫలమే నేటి స్వతంత్ర భారతం. స్వాతంత్ర్యం అంటే కేవలం జెండా ఎగరవేయడం కాదు. ప్రతి పేదవాడు, ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి యువకుడు తన కాళ్లపై తాను నిలబడటమే అసలైన దామోదర రాజనర్సింహన్నారు. మన ప్రభుత్వం అదే లక్ష్యంతో ముందుకు సాగుతుందని. గతంలోని దోపిడీ, దౌర్జన్యాలను తరిమికొట్టి నేడు ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం అన్నారు.
రైతు సంక్షేమే మా ప్రథమ ప్రాధాన్యం: 418 కోట్ల రైతు భరోసా..
రైతే రాజు అని నిరూపించేందుకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2025-26 సంవత్సరంలో సంగారెడ్డి జిల్లాలో 3 లక్షల 60 వేల 464 మంది రైతుల ఖాతాల్లో నేరుగా రూ. 418 కోట్లు జమ చేశాం. రైతు బీమా పథకం కింద 15 లక్షల 12 వేల 550 మంది రైతు కుటుంబాలకు 9,600 కోట్ల రూపాయల భీమా రక్షణ కల్పించాం. అదనంగా 1 లక్ష 48 వేల 205 మంది కొత్త రైతులను భరోసా పథకంలో చేర్చాం. 2025-26లో 33 వేల 540 మంది కొత్త రైతులకు 1 లక్ష 70 వేల ఎకరాలకు రూ. 405 కోట్ల 73 లక్షలు ఇచ్చాం. పంట నష్టం వచ్చినా రైతును ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట: రూ. 271 కోట్లు విడుదల
మహిళ లేని కుటుంబం లేదు, మహిళ లేని అభివృద్ధి లేదు. అందుకే మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. మహిళా సంక్షేమ పథకాల కింద జిల్లాలో ఇప్పటివరకు రూ. 271 కోట్ల 12 లక్షలు విడుదల చేశాం. రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకం కింద జిల్లాలో 1 లక్ష 76 వేల 570 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 21 కోట్ల 68 లక్షల సబ్సిడీ అందించాం. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు 26 కోట్ల 70 లక్షల అదనపు రుణాలు ఇప్పించాం. మహిళ ఆర్థికంగా బలపడితేనే కుటుంబం, సమాజం బలపడతాయి.పేదలకు సొంత ఇల్లు కల నెరవేర్చడం మా ప్రభుత్వ ధ్యేయం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 12,823 ఇళ్లు మంజూరు చేసి రూ. 211 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశాం. గృహజ్యోతి పథకం కింద 2 లక్షల 18 వేల 691 గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 204 కోట్ల 30 లక్షలతో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేస్తున్నాం. పేదవాడికి గూడు, గుక్కెడు నీరు, కడుపునిండా అన్నం ఇవ్వడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం. అందుకే ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సంగారెడ్డిలో రూ. 275 కోట్లతో 500 పడకల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, రూ. 168 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం, రూ. 34 కోట్లతో నర్సింగ్ కాలేజీ నిర్మాణం జరుగుతున్నాయి. సదాశివపేటలో 60 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రి, 50 పడకల మాతాశిశు ఆసుపత్రి నిర్మిస్తున్నాం. జహీరాబాద్‌లో 10 కోట్ల 46 లక్షలతో 50 పడకల మాతాశిశు ఆసుపత్రి పనులు జరుగుతున్నాయి. ప్రతి మండలంలో CHC, UPHC లను అప్‌గ్రేడ్ చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమమే మా మంత్రం: సంగారెడ్డిని నంబర్ 1 చేద్దాం
గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిదిద్దుతూ నేడు అభివృద్ధి, సంక్షేమం అనే రెండు కళ్లతో ముందుకు సాగుతున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమం ప్రతి రంగంలోనూ సంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1 గా నిలపాలని సంకల్పించాం. అమరవీరుల ఆశయాల ను సజీవంగా ఉంచుతూ, ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి చేతికి పని అందించే వరకు మా పోరాటం ఆగదు. అని స్పష్టం చేశారు. విద్యార్థుల చేత ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి ఆసక్తిగా వీక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందించారు.ఈ వేడుకలలో కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీపరితోష్ పంకజ్ వివిధ శాఖల  అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 
 
1001213216
Views: 38

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News