గంభీరావుపేట మండలంలో ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ..
గంభీరావుపేట : గంభీరావుపేట మండలంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా మరియు విత్తన విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు శనివారం విత్తన దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది. ఎస్సై ఆర్. బాలరాజు మరియు మండల వ్యవసాయ అధికారి సలావుద్దీన్ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ దుకాణాల్లో విత్తన నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు, విత్తన లైసెన్సులు, విత్తనాల నాణ్యత మరియు ధరల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దుకాణదారులకు విత్తన నిల్వలు, విక్రయాల వివరాలను రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, విత్తన ప్యాకెట్లపై ఉన్న ధర కంటే అధిక ధరలకు విక్రయించరాదని, నిబంధనలకు విరుద్ధంగా విత్తన విక్రయాలు చేపట్టరాదని సూచించారు. రైతులకు నకిలీ విత్తనాలు లేదా నాణ్యత లేని విత్తనాలు విక్రయించినట్లయితే సంబంధిత దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా మండలంలో విత్తన దుకాణాలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

