హనుమాన్ మందిరం వద్ద అయ్యప్ప మాలధారణ ప్రారంభం
సాలూర: మండల కేంద్రంలోని హనుమాన్ మందిరం వద్ద అయ్యప్ప స్వామి మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. మొదటిరోజు సాలూర గ్రామానికి చెందిన పలువురు భక్తులు గురుస్వామి లోక లక్ష్మణ్ మరియు ఏక చక్రపుర అయ్యప్ప గుడి ప్రధాన అర్చకులు సంతోష్ మహారాజ్ సమక్షంలో అయ్యప్ప స్వామి మాలను ధరించి దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప నామస్మరణ చేశారు. దీక్ష చేపట్టిన స్వాములు 41 రోజులు కఠిన నియమ నిష్ఠలను పాటిస్తూ ప్రతిరోజూ తెల్లవారుజామున పూజలు, భజనలు, ఆధ్యాత్మిక చింతనతో దీక్షను కొనసాగించనున్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు సర్వత్రా కలగాలని భక్తులు ఆకాంక్షించారు.గురు స్వాములు రాజా గౌడ్ స్వామి, హన్మంత్ స్వామి,సంజీవ్ స్వామి,సాయిలు స్వామి,శివకాంత్ పటేల్ స్వామి ,రమేష్ స్వామి,శివరాజ్ స్వామి, మణికంఠ స్వామి, జై శివ స్వామి,రాజు స్వామి కన్నె స్వామి శివరాజ్ స్వామి, సంజయ్ స్వామి మాలధారణ స్వీకరించరు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


