జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకు గాంధీజీ విద్యార్థుల ఎంపిక
నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాంపల్లిలో శనివారం నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలలో గాంధీజీ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీల్లో జడ్పీహెచ్ఎస్ నాంపల్లి, పసునూరు, కేజీబీవీ, మోడల్ స్కూల్‌తో పాటు గాంధీజీ పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ సైన్స్ పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో గాంధీజీ పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.ఈ నెల 28న నిర్వహించనున్న జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో గాంధీజీ విద్యార్థులు పాల్గొననున్నారు. మండలస్థాయిలో విజయం సాధించి జిల్లాస్థాయికి ఎంపిక కావడం విద్యార్థుల కృషికి నిదర్శనమని డాక్టర్ కోడి శ్రీనివాసులు అభినందించారు.జిల్లాస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

