ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
-ఎస్ఐ కైగూరి నరేష్
త్రిపురారం : ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి అని త్రిపురారం ఎస్ఐ కైగూరి నరేష్ అన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శనివారం మండల కేంద్రంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో శ్రీ దేవి ఉపాసకులు ఎల్లయ్యస్వామి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు, అయ్యప్ప, ఆంజనేయస్వామి మాలలు ధరించిన స్వాములకు అన్న ప్రసాద వితరణ చేశారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు భైరం కృష్ణ, నగిరి వెంకన్న, అనుముల సుధాకర్ రెడ్డి, వాటర్ ప్లాంట్ రాంబాబు, బచ్చలకూరి వెంకన్న, పల్లెబోయిన సైదులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


