హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
నిజామాబాద్ : నిజమాబాద్ అదనపు కలెక్టర్ భుజంగా రావు ను సత్కరించిన టీజీ సాక్స్ డిప్యూటీ డైరెక్టర్. హెచ్ఐవి ఎయిడ్స్ నిర్ధారణ, నివారణ, నియంత్రణ కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన నిజామాబాద్ జిల్లాకు సురక్షిత స్థాయి గుర్తింపు లభించింది ,తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మదిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమం కింద జిల్లా ఈ ఘనతను సాధించంది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ భుజంగరావు గారిని టీజీ సెక్స్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ నరేష్ రెడ్డి , అడిషనల్ డైరెక్టర్ ఫని రేఖ మరియు డిఎం అండ్ డాక్టర్ బి రాజశ్రీ ఘనంగా సత్కరించి అభినందించారు. జిల్లా యంత్రాంగం అందించిన పూర్తి సహకారంతోపాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ అధికారులు ఐసిటిసి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సమన్వయ కృషి వల్ల ఈ గుర్తింపు సాధ్యమైందని డిప్యూటీ డైరెక్టర్ నరేష్ రెడ్డి ప్రశంసించారు. రాబోయే రోజుల్లో హెచ్ఐవి పరీక్షల విస్తరణ, పాజిటివ్ వ్యక్తులను ఏఆర్టి చికిత్సలకు అనుసంధానించడం, వైరల్ లోడ్ పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు స్క్రీనింగ్, ఇండెక్స్ టెస్టింగ్, ఇంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవి నిర్ధారణ, చికిత్స,నివారణ, నియంత్రణ చర్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు, నియంత్రణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు మరింత బలోపేతం చేసి 95-95-95 లక్ష్యాలను 100% చేరుకోవడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తదుపరి లక్ష్యమైన సురక్షిత ప్లస్ స్థాయిని సాధించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ, అడిషనల్ డైరెక్టర్ ఫని రేఖ, ప్రోగ్రాం అధికారి డాక్టర్ భార్గవి, ఏ ఆర్ టి వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్, డిపిఏoఓ సుధాకర్, డిహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, సీపీఓ మో ఈజ్, సి ఎస్ ఓ నవీన్, సహాయోగి సమతా, వై ఆర్ జి సుధాకర్, స్నేహ సొసైటీ శివ, సిఎస్సి కోఆర్డినేటర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


