ఐక్యత చాటిన ముదిరాజులు.. ఘనంగా మత్స్యకారుల దినోత్సవం, జెండా పండుగ

ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలో చేర్చాలి. నీలం పెద్దులు

ఐక్యత చాటిన ముదిరాజులు.. ఘనంగా మత్స్యకారుల దినోత్సవం, జెండా పండుగ

జగిత్యాల డివిజన్ ఇంచార్జి :  తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని స్థానిక మంచినీళ్ల బావి వద్ద మత్స్యకారుల దినోత్సవం, ముదిరాజ్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు నీలం పెద్దులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నీలం పెద్దులు మాట్లాడుతూ.. ముదిరాజుల చిరకాల కోరిక అయిన బీసీ-డీ నుంచి బీసీ-ఏలో చేర్చాలనే డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తమ డిమాండ్‌ను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముదిరాజుల హక్కుల సాధన కోసం కులస్తులందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జంగిల్ రాజేష్, కట్ట గంగాధర్, జైనపురం భీమ్, జీకురి గంగాధర్, సబ్బని లక్ష్మయ్య, కట్ట భూమయ్య, పెండల క్రాంతి, ఆరే హనుమంతు, ఎర్రవేని నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి