చలో జనగామ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎల్‌హెచ్‌పీఎస్
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర సమ్మయ్య నాయక్ నవంబర్ 29న నిర్వహించే రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలి
భూపాలపల్లి : లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) ఆధ్వర్యంలో నవంబర్ 29న జనగామ పట్టణంలోని విజయ మినీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో ఆవిష్కరించారు. ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు నవరామ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర సమ్మయ్య నాయక్ ముఖ్య అతిథిగా హాజరై చలో జనగామ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అజ్మీర సమ్మయ్య నాయక్, హరిభూషణ్, నవరామ్ నాయక్ మాట్లాడుతూ బంజారా, లంబాడి గిరిజనుల హక్కుల సాధన, తండాల అభివృద్ధి, గిరిజనుల సాగు భూములకు పట్టాల జారీ, విద్యా, ఉద్యోగ, సాంస్కృతిక హక్కుల పరిరక్షణ ప్రధాన లక్ష్యాలుగా ఈ రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 29న జనగామలోని విజయ మినీ కన్వెన్షన్ హాల్‌లో జరిగే సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా బంజారా, లంబాడి సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఎల్‌హెచ్‌పీఎస్ ప్రధాన డిమాండ్లు,రాష్ట్రంలోని అన్ని తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి.2. తండాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక తండా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.3. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పట్టాలు జారీ చేయాలి.4. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ఉద్యోగ నియామకాల్లో 100 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.5. గిరిజనులకు పెంచిన 10 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలి.6. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 15 కోట్ల మంది బంజారాల మాతృభాష గోర్ బోలి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలి.7. గిరిజన ఉద్యోగులపై జరుగుతున్న ఉద్దేశపూర్వక దాడులను అరికట్టి, పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి.బంజారా, లంబాడి గిరిజనుల హక్కుల పరిరక్షణ, సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర సమ్మయ్య నాయక్, రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు నవరామ్, తిరుపతి, భూక్య హరి, లావణ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

