మిడ్జిల్ కేజీబీవీలో రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన
మానవతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు ప్రత్యేక అవగాహన.. రేవంత్ అన్న పంటివెలుగు కార్యక్రమంలో ఉచిత దంత వైద్య శిబిరం
మిడ్జిల్, : మిడ్జిల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మానవతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమంతో పాటు ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ రమ్య సౌజన్య విద్యార్థినులకు రుతుక్రమ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రుతుక్రమం సహజమైన ప్రక్రియ అని, ఈ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అలాగే రేవంత్ అన్న పంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా డాక్టర్స్ సెల్ జనరల్ సెక్రటరీ, మాక్సిలోఫేషియల్ రేడియాలజిస్ట్ డాక్టర్ పవన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా దంత సమస్యలు, నోటి పరిశుభ్రత, దంతాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.బాలికల్లో రుతుక్రమ పరిశుభ్రతపై చైతన్యం పెంపొందించడంతో పాటు దంత ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎం.డి. గౌస్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎడ్ల శంకర్, జోతియాల రెడ్డి, నరేంద్ర రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ కవిత, వెంకటేశ్ గౌడ్, రాజేశ్, రమేష్, రవీందర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


