చౌటకూర్‌లో జాతీయ రహదారిపై ధాన్యం ఆరబోత.. వాహనదారుల అవస్థలు!

ప్రమాదాలకు నిలయంగా ఎన్‌హెచ్-161 - పట్టించుకోని జాతీయ రహదారుల అధికారులు

చౌటకూర్‌లో జాతీయ రహదారిపై ధాన్యం ఆరబోత.. వాహనదారుల అవస్థలు!

చౌటకూర్  :- సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని 161వ నంబరు జాతీయ రహదారిపై వరి ధాన్యాన్ని ఆరబోస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వీస్ రోడ్డుతో పాటు ప్రధాన రహదారి అంచుల వరకు రైతులు పెద్ద ఎత్తున ధాన్యం పోయడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్డుపై పోసిన ధాన్యం రాశులు స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. ధాన్యంపైకి వాహనాలు రాగానే అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి రావడంతో, ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి స్కిడ్ అవుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే కీలకమైన జాతీయ రహదారిపై ఈ పరిస్థితి నెలకొన్నప్పటికీ, సంబంధిత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అధికారులు గానీ, స్థానిక యంత్రాంగం గానీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెను ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించకముందే ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. రహదారిపై ఆరబోసిన ధాన్యాన్ని తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో రహదారులపై ధాన్యం ఆరబెట్టకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Views: 55

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News