రేగోడ్ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన శ్రీ సరస్వతి మాధవానంద స్వామి
పూర్ణకుంభంతో ఘన స్వాగతం ఆలయ పునర్నిర్మాణానికి పలు సూచనలు భక్తులకు తీర్థప్రసాదాల వితరణ.
రేగోడు (మెదక్ ): రేగోడ్‌లోని శ్రీ దుర్గమ్మ ఆలయాన్ని శనివారం మధ్యాహ్నం శ్రీ సరస్వతి మాధవానంద స్వామి సందర్శించారు.ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ కమిటీ బాధ్యులు, భక్తులు పూర్ణకుంభంతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారు భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలను వితరణ చేశారు.అనంతరం దుర్గమ్మ ఆలయాన్ని, అక్కడి పురాతన విగ్రహాలను పరిశీలించి, ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు.దుర్గాదేవి అమ్మవారిని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించుకుని, భక్తిశ్రద్ధలతో నిత్య పూజలు నిర్వహించాలని సూచించారు.ఆలయ నిర్మాణాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ పునర్నిర్మాణ కమిటీ బాధ్యులు,భక్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


