అంతర్జాతీయ మత్స్య కారుల దినోత్సవం సందర్బంగా మత్స్య కారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ : అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారులు తమ శ్రమ, నైపుణ్యంతో ఆహార భద్రతకు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. వారి సంక్షేమం, ఉపాధి అవకాశాల మెరుగుదల, మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చేపలు, రొయ్యల ఉత్పత్తిని పెంచడంతో పాటు నాణ్యమైన చేప పిల్లల పంపిణీ, మత్స్యకార కుటుంబాలకు సంక్షేమ పథకాలు, నిల్వ–రవాణా సదుపాయాలు, మార్కెటింగ్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. మత్స్యకారుల కష్టానికి తగిన ఆదాయం, గౌరవం కల్పించేందుకు మరింత కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి భరోసా ఇచ్చారు.ఈ దినోత్సవం మత్స్యకారుల సేవలను గుర్తుచేసుకోవడంతో పాటు, వారి జీవన ప్రమాణాలు మెరుగు పడే విధంగా సమిష్టిగా కృషి చేయాలని మంత్రి అకాక్షించారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


