నందిపేట్లో అక్రమ కట్టడాల కూల్చివేత
నిజామాబాద్ : నందిపేట మండలంలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. స్థానిక పడిగల చెరువు కట్ట బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. పోలీసు బందోబస్తు మధ్య.. ట్రైయినీ కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సురేష్ పామూరి ఆధ్వర్యంలో అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో బఫర్ జోన్లో ఉన్న అక్రమ కట్టడాల వద్దకు ఉదయం చేరుకున్నారు. ఆ స్థలంలో నిర్మించిన రేకుల షెడ్లను, భవంతుల నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టవద్దని, నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలను ఎట్టిపరిస్థితుల్లో కూల్చివేస్తామని హెచ్చరించారు కూల్చివేత కార్యక్రమంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

