కాఫెడ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమం

కాఫెడ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమం

వెంకటాపురం  : కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెంకటాపురం మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాన్ని కాఫెడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,నాయకులగూడెం ప్రాథమిక పాఠశాల, పాత్రపురం, మంగవాయి , అంకన్నగూడెం ఎంపీపీఎస్, రామచంద్రపురం ఎంపీయూపీఎస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, బోదాపురం ఎంపీపీఎస్ పాఠశాలలకుకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, కళా నైపుణ్యాలను వెలికితీయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక ఐక్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు , ఇతర కళారూపాల ద్వారా తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.ముఖ్య అతిథులుగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శిరీష, వెంకటాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, రామచంద్రపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయశ్రీ, పాత్రపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగమణి, అంకన్నగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీలత, నాయకులగూడెం ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం పాల్గొన్న విద్యార్థులందరికీ బహుమతులు అందజేశారు. బహుమతులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.గిరిజన ప్రాంత విద్యార్థులకు విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, సాంస్కృతిక అభివృద్ధి , సమాన అవకాశాలు కల్పించేందుకు కాఫెడ్ సంస్థ నిరంతరం కృషి చేస్తోందని సంస్థ డైరెక్టర్ బ్రదర్ కె. లూర్దు రాజు తెలిపారు. కోఆర్డినేటర్స్ గొంది హనుమంతు, కామేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 23

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి